తెలంగాణ మోడల్ స్కూల్‌లో వైభవంగా ‘జాతీయ విజ్ఞాన దినోత్సవం’

తేది:28-02-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రిన్సిపాల్ కేనావతి ఆదేశానుసారం, కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
​ఆకట్టుకున్న సైన్స్ నమూనాలు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి వివిధ రకాల వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన నైపుణ్యాలను, వారు రూపొందించిన పరికరాలను చూసి స్థానిక ఇతర పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యార్థులు తాము తయారు చేసిన నమూనాల పనితీరును మరియు వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను అతిథులకు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంథాలయ విభాగం ఇతర అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజ్ఞాన శాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వక్తలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అక్షర భారతి మోడల్ స్కూల్ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *