అల్టిమేటం: ఆయుధాలను వదిలేస్తారా? చస్తారా? ఇరాన్ సైన్యానికి ట్రంప్ వార్నింగ్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడమే కాకుండా, అక్కడి సైన్యానికి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్, శనివారం అమెరికా దళాలు ఇరాన్‌లో భారీ యుద్ధ పోరాటాన్ని ప్రారంభించినట్లు ధ్రువీకరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తోంది.

ట్రంప్ జారీ చేసిన ప్రధాన హెచ్చరికలు:

  • అంతిమ నిర్ణయం: ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ఆయుధాలను పక్కన పడేసి ప్రాణాలు దక్కించుకుంటారా లేక చావును కోరుకుంటారా అని ట్రంప్ ప్రశ్నించారు.

  • క్షీపణి పరిశ్రమ ధ్వంసం: ఇరాన్ క్షిపణి పరిశ్రమను, వారి నావికాదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ట్రంప్ ఉద్ఘాటించారు.

  • అమెరికా లక్ష్యం: ఇరాన్ దుర్మార్గపు పాలన నుంచి అమెరికా పౌరులను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు.

  • ప్రాణనష్టం: ఈ యుద్ధంలో అమెరికా సైనికుల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం ఈ పోరాటం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్ ప్రజలకు సూచన

ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చే సమయం ఆసన్నమైందని, బయట పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావద్దని ట్రంప్ సూచించారు. టెహ్రాన్, ఇస్ఫాహాన్, కరాజ్ వంటి ప్రధాన నగరాలపై ఇప్పటికే దాడులు జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *