బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

 

 

న్యూఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో భాగంగా బీసీలకు పొలిటికల్ రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఆందోళనలు చేపట్టారు. ధర్నాలో భాగంగా బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణరాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాజకీయపరంగా బీసీలను అణగదొక్కుతూనే ఉన్నారు కానీ బీసీలకు బంగారు భవిష్యత్తు చూపే విధంగా ఏ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించకుండా కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపుతున్నారే గాని బీసీలకు ప్రత్యేకంగా పొలిటికల్ రిజర్వేషన్ కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వనికి అధ్యక్షత వహించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి బీసీల పొలిటికల్ రిజర్వేషన్ గురించి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమస్యలను పరిష్కరించటకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఇట్టి ధర్నాలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *