పోలీస్ కళా బృందంచే రోడ్డు భద్రతా నియమావళి పై అవగాహన.

తేది :27-02-2026 TSLAWNEWS రాయికల్
రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: ఎస్ పి అశోక్ కుమార్ ఐ పి ఎస్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ సూచనలను అనుసరించి రాయికల్ ఎస్ఐ సుధీర్ రావు ఆధ్వర్యం లో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపతిపూర్ నందు శుక్ర వారం రోజున పోలీస్ కళా బృందంచే సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు, సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, రోడ్డు భద్రతా నియమావళి లో భాగంగా ఎర్రివ్ – ఎలీవ్ కార్యక్రమం, ఆధునిక చట్టాల పైన అవగాహన కల్పించారు. లో విద్యార్థినీ, విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతినబూనినారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు వస్తుందని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, ఉపాధ్యాయులు శంకరయ్య, సత్యనారాయణ, సహబజ్ హుస్సేన్, సంజయ్ కుమార్, వేణుగోపాల్, సురేష్, పుష్పలత, భవానీ, శైలజ, పోలీస్ కళా బృందo పోలీస్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్, గడ్డం రమేష్, కమల్, సతీష్, లక్ష్మణ్, హనుమంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *