తేది: 27-02-2026 TSLAWNEWS రాయికల్ మండలం కిష్టంపేట గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో 12 లక్షల నిధులతో అంగన్వాడి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తున్నాయి…పేద మధ్య తరగతి ప్రజల పిల్లలు ప్రైవేట్ ప్లే స్కూల్ తరహా మౌలిక సదుపాయాలు నాణ్యమైన బోధన కల్పించే విధంగా అంగన్వాడిల బలోపేతానికి చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తో కలిసి పని చేసి గ్రామాల అభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, రైతు భరోసా నిధులు త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఏకకాలంలో 21వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. విద్య తో సామాజిక అసమానతలు తొలగుతాయి..ఎవరు దోచుకొనిది విద్య మాత్రమే..విద్యా శాఖ మంత్రి గా ముఖ్యమంత్రి విద్య రంగ అభివ్రుద్ది కి కృషి చేస్తున్నారు. ఈ జి ఎస్ పేరు మార్చి నిబంధనలు కఠినతరం చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాలి. గ్రామాల్లో చేపట్టే అభివృద్ది పనులు, ఉపాధి హామీ పనుల విషయంలో అన్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజా గౌడ్, ఉప సర్పంచ్ చాంద్ పాషా, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బెజ్జంకి మోహన్, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మా, ఏఈ ప్రసాద్, మాజీ సర్పంచ్ జనా స్వరూప గోపి, రమేష్, మాజీ ఎఎంసీ డైరెక్టర్ తిరుపతి గౌడ్, మాజీ ఎంపిటిసి గంగాధర్, సీడీపీఓ మమత, నాయకులు ఆది రెడ్డి, వెంకన్న, శేఖర్, శ్రీనివాస్, మండల గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.