కొండగట్టు అంజన్న తలనీలాలకు రూ. 4.44 కోట్ల భారీ ఆదాయం.

తేది:27-02-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ఈవో శ్రీకాంతరావు కార్యాలయంలో గురువారం నిర్వహించిన బహిరంగ వేలంలో మొదట రాజా ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు రూ. 2.70 కోట్లకు పాడారు. చివరగా పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన ఇండియన్ హ్యూమన్ హెయిర్ సంస్థ రూ. 4.44 కోట్లకు దక్కించుకోవడం విశేషం. కాగా, మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన ఈ వేలం పాట రాత్రి 10 గంటల వరకు ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *