తేది:26-02-2026 నల్గొండజిల్లా TSLAWNEWS ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్లగొండ జిల్లా: కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో గురువారం రోజు చా,ఐ,స నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎలిజల శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి శంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో 2026 ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్,తల్లి చంద్రకళ,భార్య మౌనిక,అక్క కీర్తి దైవ దర్శనం కోసం వెళ్లారు వీరిని కులం పేరుతో దూషించి,దౌర్జన్యం,దాడి చేసి గణేష్ యొక్క 2నెలల పసి బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులై ఉంద్యాల శ్రీనివాస్‌రెడ్డి సర్పంచి తుకారం రెడ్డితో పాటు తొమ్మిది మంది నిందితులను కఠినంగా శిక్షించాలని,చా,ఐ,స.ఫౌండర్ చైర్మన్ రచయిత ఐదారి శంకర్ అన్నారు.కులం పేరుతో దూషించి,దౌర్జన్యం,దాడిచేసి మృగాల్లా ప్రవర్తించి,రెండునెలల పసిబిడ్డను హత్య చేశారు. మహిళలని కూడా చూడకుండా,నానా బూతులు తిట్టి అవమానించారు.ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ను మూడున్నర గంటల పాటు పైన పేర్కొన్న పెత్తందారులు ఒక గదిలో నిర్భంధించి చితకబాదారు.తన భర్తను కొట్టొద్దని కాళ్ళమీద పడి మౌనిక బతిమిలాడి వేడుకున్నా, కాళ్లతో తన్నారే కానీ,కనీసం కనికరించలేదు.ఘటన జరిగి ఎనిమిది రోజులై నప్పటికీ 8 మంది హంతకులకు గాను,కేవలం నాలుగురిని మాత్రమే అరెస్టు చేసారు.హంతకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని.
తక్షణమే తొమ్మిది మంది హంతకును అరెస్టు చేసి,రిమాండ్‌కు పంపి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము.బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ అయితరాజు లక్ష్మణ్,నల్గొండ పట్టణ అధ్యక్షుడు నలపరాజు సైదులు సురకారపు యాదగిరి గౌడ్ రాజు వినయ్ కుమార్ గోపాల్ సోమనబోయిన వెంకన్న, కారింగ్ శేఖర్,బీసం శ్రీనివాస్, మేడి నరసింహ,ఈదులకంటి నగేష్, అనుముల దేవి, లింగంపల్లి రాజశేఖర్,, స్వామి,ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కుల సంఘాల,ప్రజాసంఘాల నాయకులు తదితరులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు.