టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా కన్నుల పండువగా జరిగింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నడుస్తున్న సస్పెన్స్‌కు తెరదించుతూ, ఈ ఉదయం 10:10 గంటలకు అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు వేశారు. కేవలం సంప్రదాయబద్ధంగానే కాకుండా, రష్మిక సొంత ప్రాంతమైన కూర్గ్ సంప్రదాయం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు కొడవ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకోనున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజజీవితంలోనూ ఒక్కటవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఈ వివాహ వేడుకకు అభిమానులు ముద్దుగా పిలుచుకునే “విరోష్” (ViRosh) అనే పేరునే అధికారికంగా ఖరారు చేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా “విరోష్ ప్రీమియర్ లీగ్” పేరుతో అతిథుల కోసం ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. నిన్న జరిగిన సంగీత్, హల్దీ వేడుకల్లో విజయ్-రష్మిక జంట డాన్స్‌లతో హోరెత్తించారు. ముఖ్యంగా ఈ పెళ్లికి హాజరైన అతిథుల కోసం జపనీస్ వంటకాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఈ వివాహ వేడుకలో మరో హైలైట్‌గా నిలిచింది. రాజస్థానీ రాయల్టీకి ఆధునిక హంగులు జోడిస్తూ ఈ పెళ్లిని ప్లాన్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులు “ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్” హ్యాష్ ట్యాగ్‌తో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అత్యంత ఖరీదైన ‘మెమెంటోస్ బై ఐటీసీ’ హోటల్‌లో జరుగుతున్న ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన కొద్దిమంది స్టార్ సెలబ్రిటీలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ తన భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేస్తూ, తన ప్రాణ స్నేహితురాలినే భార్యగా పొందడం తన అదృష్టమని పేర్కొన్నారు