రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ బదిలీలు మెదక్‌లో కీలక మార్పు. రాహుల్ రాజ్‌కు సహకార శాఖ, మెదక్‌ జిల్లా కలెక్టర్ గా ప్రతిమా సింగ్ ఐఏఎస్.

తేది:26-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ కె. రామ్ కిషన్ రావు జి.ఓ.ఎం.ఎస్. నెం.290 తేదీ 25.02.2026న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా మెదక్ జిల్లాకు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పటివరకు మెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాహుల్ రాజ్ ఐఏఎస్ స్పెషల్ కమిషనర్, కో-ఆపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ చేశారు. జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో ఆయన చురుకైన పాత్ర పోషించారు. పరిపాలనా సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ గుర్తింపు పొందింది.
మెదక్ జిల్లా కొత్త కలెక్టర్‌గా శ్రీమతి ప్రతిమా సింగ్ ఐఏఎస్ నియమితులయ్యారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఆమెకు మెదక్ జిల్లాతో పూర్వ అనుభవం ఉంది. రెండు సంవత్సరాల క్రితం మెదక్ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసి పరిపాలనలో సమర్థతను చాటుకున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను తిరిగి మెదక్‌కు బదిలీ చేయడం విశేషంగా నిలిచింది.
జిల్లా పరిపాలనలో ఇప్పటికే అనుభవం కలిగిన అధికారి కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. రైతు సంక్షేమం, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, విద్య–ఆరోగ్య రంగాల పర్యవేక్షణలో ఆమెకు ఉన్న అనుభవం జిల్లాకు ఉపయోగపడనుంది.
కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధి కార్యాచరణపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పరిపాలన మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో ప్రజల్లో ఆశావహ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *