హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

తేది:25-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ :హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓయూ ఏసిపి జగన్ తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని హబ్సిగూడ లోని గ్రీనిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి ఎల్ కె ఎం రావు ఇంట్లో పని మనిషిగా విధుల్లో చేరింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అల్లం తేజస్విని ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగిలించి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కాలని నిశ్చయించుకుంది. ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఇంటి యజమాని కళ్ళు కప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. అనుమానం వచ్చిన ఇంటి యాజమాని బీరువాను తీసి చూడగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారుపడ్డ ఇంటి యాజమాని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 36 గంటల్లో చాక చక్యంగా నిందితురాలని అరెస్టు చేసి, ఆమె దగ్గర్నుంచి 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు, పదివేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. అనంతరం కేసును చాకచక్యంగా చేదించిన సిబ్బందికి ఏసీపీ జగన్ రివార్డును అందించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *