రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న యుట్యూబర్ కోమలి.

తేది:25-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ :మూడు సంవత్సరాలుగా మరో యుట్యూబర్ తో ప్రేమలో ఉన్న కోమలి. మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న కోమలి.
మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి.మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు..పార్ట్ టైమ్ లో యూట్యూబ్ వీడియోలు చేస్తూన్న కోమలి.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబర్ గా రాణిస్తున్న అఖిల్ రెడ్డితో కోమలికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఈ క్రమంలో మూడేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు.
ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు బ్రేక్అప్ చెప్పుకొని విడిపోయారు.కోమలి మాత్రం అఖిల్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో మనస్థాపానికి గురై గతంలో ఆత్మహత్యకు యత్నించగా,కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు.అఖిల్ ను మర్చిపోలేకపోయిన కోమలి గత రెండు రోజుల క్రితం ఫోన్ చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాగం జరిగింది.
దీంతో మనస్దాపానికి గురైన కోమలి సోమవారం చిత్రపురి కాలనీలోని తన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు.సీసీటీవీ ఫుటేజ్
కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డి:
అఖిల్, కోమలికి ఏడాది క్రితం బ్రేక్ అప్ అవ్వగా, అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి
తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా, నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్ దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *