వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈనెల 18న సీఎం ప్రారంభించనున్నారు. దీనిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశాం. ఈ పథకమే దీనికి ఉదాహరణ’ అని సీఎం తెలిపారు.