తేది:24-02-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజక వర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ.
వికారాబాద్ జిల్లా:వికారాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్దులూరు కాంప్లెక్స్ పరిధిలోగల ప్రాథమిక పాఠశాలలకి శిక్షణా ఫౌండేషన్ సంస్థ వారు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. కాంప్లెక్స్ పరిధిలోగల పాఠశాలలు పాల్గొన్నారు. ప్రథమ బహుమతి ప్రాథమిక పాఠశాల కొటాలగూడ, ద్వితీయ బహుమతి ప్రాథమిక పాఠశాల పులుసు మామిడి, తృతీయ బహుమతి ప్రాథమిక పాఠశాల సిద్ధులూర్ గెలుచుకోవడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు క్విజ్ పోటీలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేలా ఉన్నాయని తెలియజేశారు. కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ డిస్టిక్ మేనేజర్ నాగరాజు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, శిక్షణ ఫౌండేషన్ మెంటర్స్ పాల్గొన్నారు.