తేది:24-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లాలోనీ రాయికల్ మండలం లో సోమవారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, కాలనీలు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో మురికి కాలువలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు రాయికల్ -భూపతిపూర్ , రాయికల్-కోరుట్ల మధ్య రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా కొంతసేపు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలో మురుగు కాలువల శుభ్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి పిందె దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలగా,మొక్కజొన్న పంట కూడా నేలవాలిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.