వడగండ్ల వర్షం కారణంగా నేలకొరిగిన మొక్క జొన్న పంటలను పరిశీలించి మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి.

తేది:24-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా : పంట నష్టపోయిన రైతులతో కలిసి నష్టపోయిన పంటను పరిశీలించారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కలెక్టర్ తో మరియు వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలి అని సూచించారు
జగిత్యాలలో నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఈదురు గాలులతో కూడిన వర్షంతో మామిడి మొక్కజొన్న పంట నేలకొరిగింది రాయికల్ మండలంలోని రామాజీపేట, కొత్తపేట ,జగిత్యాల అర్బన్ మోతె మరియు జిల్లాలో పలు గ్రామాలలో రైతులకు బారి నష్టం వాటిల్లిందని అని అన్నారు.
రామోజీ పేట్ గ్రామంలో కొత్త వెంకటేష్ కౌలు రైతు నిర్మల్ నుండి వచ్చిన వలస కూలి తీవ్రంగా పంట నష్టపోయారు పంట బీమా పథకం లేనందున ప్రభుత్వమే ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలి రైతు దేశానికి వెన్నుముక అలాంటి రైతును రైతాంగాన్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బిడ్డ కాబట్టి రైతుల పక్షాణ దృష్టి సారించాలి
ప్రభుత్వం రైతులను అదుకుటుందని ఆశిస్తున్నాను
రాష్ట్ర రైతాంగానికి ఫిబ్రవరి చివరిలోగా రైతు భరోసా అందించి రైతుకు అండగా నిలవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *