తేది:24-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా: మామిడి రైతులు అధైర్య పడవద్దని జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, ఇటిక్యాల గ్రామాల్లో మంగళవారం మామిడి తోటలను పరిశీలించారు. అకాల వర్షం వలన పూతదశలో ఉన్న మామిడి తోటలు నష్టం చెందవని, జొన్న గింజ సైజు నుంచి బటాని గింజ సైజు వరకు మామిడిలో ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. వర్షానికి గాలిలో తేమశాతం పెరుగుతుందని, ముందస్తు చర్యలు పాటించాలని రైతులకు సూచించారు.