తేది:24-02-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్-2లో మంగళవారం ‘ఆరోగ్య లక్ష్మి’ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం మరియు తదితర సేవలపై ఆమె సమీక్షించారు. అనంతరం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాలామృతం ప్యాకెట్లు మరియు కోడిగుడ్లను సర్పంచ్ స్వయంగా చిన్నారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని , అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం తల్లులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు రజిత, మేఘమాల ఏఎన్ఎం జ్యోతి వార్డ్ మెంబర్ మందుల రాధ, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.