తేది: 23-02-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రాయికల్ మండలం రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లాలో నీ రాయికల్ మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన తమ్మనవేని రాజుకుమార్ పీఎంజేజేబివై భీమా పథకంలో చేరి రూ.436 ప్రీమియం చెల్లించారు. ఇటీవల ఆయన మరణించగా.. సంబంధిత పత్రాలను ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్ సమర్పించడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ నరేష్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తి చేసి రూ.2 లక్షల భీమా చెక్కును నామినీ అయిన భార్య లహరికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఖాతాదారుడు పీఎంఎస్బీవై, పీఎంజేజేబివై వంటి ప్రభుత్వ భీమా పథకాలలో చేరాలని మేనేజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు, నవీన్, మేఘమాల తదితరులు పాల్గొన్నారు.