‘విరోష్’ పెళ్లి సందడి: విజయ్ దేవరకొండ, రష్మిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఉదయ్‌పుర్‌లో ఘనంగా వివాహం: టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులను ఖుషీ చేశారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పుర్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఈ జంట తమ పెళ్లి వేడుకల కోసం ఉదయ్‌పుర్ చేరుకోగా, అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) అనే పేరునే తమ వివాహ ముద్రగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ కపుల్ సంపాదన మరియు ఆస్తుల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాలు: సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ, ఒక్కో చిత్రానికి సుమారు రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఆయనకు రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా ఉంది. వీటితో పాటు BMW 5 సిరీస్, ఫోర్డ్ ముస్తాంగ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. సొంత చిత్ర నిర్మాణ సంస్థను కూడా కలిగి ఉన్న విజయ్ మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ.60 నుంచి రూ.70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

నేషనల్ క్రష్ రష్మిక నెట్ వర్త్: మరోవైపు ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న కెరీర్ పరంగా విజయ్ కంటే తక్కువేమీ కాదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లుగా ఉంది. బెంగళూరులో రూ.8 కోట్ల విలువైన ఇంటితో పాటు హైదరాబాద్, ముంబై, గోవా, కూర్గ్ వంటి ప్రాంతాల్లో ఆమెకు స్థిరాస్తులు ఉన్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడిస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను ఉపయోగిస్తున్న రష్మిక, ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. సినిమాలతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటనల ద్వారా కూడా ఆమె భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *