అల్లీపూర్ లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.

తేది:22-02-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: అల్లీపూర్ గ్రామంలో మంజూరై నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు యం.ఏ. మోఖీద్, దొబ్బల వేణు సూచించారు. ఆదివారం వారు గ్రామంలో పర్యటించి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో నిర్మితమవుతున్న గృహాల పురోగతిని లబ్ధిదారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి చివరి నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు సాగాలని స్పష్టం చేశారు. జీఓ నంబర్ 96 ప్రకారం.. గతంలో గృహలక్ష్మి లేదా ఇందిరమ్మ పథకం కింద బేస్‌మెంట్ లెవల్‌ వరకు పనులు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు, మిగిలిన నిర్మాణ పనుల కోసం రూ. 4 లక్షల ఆర్థిక సాయాన్ని విడతల వారీగా పొందే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు బిరుదుల రజిత శేఖర్, అరికిళ్ల సరోజన రవి, అరికిళ్ల లక్ష్మి అంజయ్యలతో పాటు కాంగ్రెస్ నాయకులు స్పందన- సాగర్ రావు, చిలుముల గంగానర్సయ్య, రాజేందర్, విష్ణు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *