తేది: 22-02-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండలం ఎక్స్ రోడ్ సమీపంలోని వరద కాలువలో ఆదివారం ఓ కారు నీటిలో తేలియాడుతుండడాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో కారును తాళ్లతో బయటకి లాగుతున్నారు. కాగా, కారు 5రోజుల క్రితమే నీటిలో పడిందని, అందులో పెగడపల్లి మండలం సుద్దపెల్లికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.