తేది:21-2-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : వైద్యం వికటించి 6 నెలల శిశువు మృతి
సన్ సిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
రాము అనే ఆరు నెలల శిశువు చికిత్సలో భాగంగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
శిశువుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ వైద్యులు గడువు ముగిసిన (ఎక్సైపిరి) మందు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మందు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో పరిస్థితి అదుపులోకి రాక మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారుల ద్వారా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ఆస్పత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.