విమర్శకులకు బాలయ్య మాస్టర్ స్ట్రోక్: హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి భూమి పూజ!

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరంటూ వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో తన సొంత ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం సతీమణి వసుంధరతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి తన ‘కేరాఫ్ హిందూపురమే’ అని ప్రకటించారు. వరుసగా మూడుసార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజల కోసం ఇక్కడే ఉండి సేవ చేస్తానని స్పష్టం చేశారు.

గత కొంతకాలంగా వైసీపీ నేతలు బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారని, ప్రజల సమస్యలు పట్టించుకోరని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, ఇతర నేతలు ఆరోపించారు. హిందూపురం ప్రజలు హైదరాబాద్‌లో ఉండేవారికి బానిసలుగా మారారంటూ వైసీపీ ఇంఛార్జి భర్త వేణు రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సొంతిల్లు కట్టుకోవడం ద్వారా బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించినట్లయింది.

తన తండ్రి ఎన్టీఆర్ కాలం నుండి హిందూపురం ప్రజలు నందమూరి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నారని బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హిందూపురంలో ఇల్లు కట్టుకోవాలనేది తన చిరకాల కోరికని, అది ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కేవలం నివాసం ఉండటమే కాకుండా, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రథమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *