మెదక్‌లో వీధి కుక్కల భయం – మహిళపై దాడి, తీవ్ర గాయాలు.

తేది:19-2-2026 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ సార సురేష్.

మెదక్ పట్టణంలో వీధి కుక్కల బెడద మరోసారి బయటపడింది. గురువారం శాంతి నగర్ కాలనీలో జరిగిన ఘటనలో స్థానికురాలు లక్ష్మమ్మపై వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
ఇంటి ఎదుట నిలబడి ఉన్న లక్ష్మమ్మపై కుక్క దూసుకొచ్చి కుడి కాలును గట్టిగా కరచడంతో రక్తస్రావం జరిగింది. ఆమె అరుపులు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు కుక్కను వెంబడించడంతో మరింత ప్రమాదం తప్పింది. వెంటనే బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పట్టణంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *