ట్రైని గ్రూప్ 1 అధికారుల పర్యటన.

తేది:18-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండలం రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా : మండలం పరిధిలోని గడి పెద్దాపూర్ గ్రామంలో బుధవారం ట్రైన్ గ్రూప్ 1 అధికారులు పర్యటించారు. గ్రామంలో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగులకు అందుతున్న వైద్యం గురించి గ్రామ పంచాయతీల పరిపాలన విధానం పొదుపు సంఘాలు ఉపాధి హామీ కూలీల పనితీరు ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అమలవుతున్నా తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ గ్రూప్ వన్ అధికారులు ముగ్గురు డి.ఎస్.పిలు ప్రణీత్, సూర్య తేజ, మౌనిక, ముగ్గురు కమర్షియల్ టాక్స్ అధికారులు సిరివెన్నెల, దివ్య, రాజశేఖర్ రెడ్డి, వీరి వెంబడి ఎంపీడీవో వేద ప్రకాశ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ విట్టల్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *