తేది:18-02-2026 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ సార సురేష్.
మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారత చైతన్య యువజన పార్టీ (BCY)మెదక్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి రోహిత్ గుప్తా గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయంలో అమ్మవారి దర్శనం ముగించుకుని మెదక్‌కు తిరిగి వస్తున్న సమయంలో, ఈరోజు ఉదయం మెదక్ జిల్లా కొల్చారం జాతీయ రహదారి 765 వద్ద వారి కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రోహిత్ గుప్తా గారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆయన ప్రాణాలు నిలువలేకపోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
యువ నాయకుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన రోహిత్ గుప్తా గారి ఆకస్మిక మృతి రాజకీయ వర్గాల్లో దుఃఖాన్ని కలిగించింది. ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.