తేది:17- 02- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి. పాపయ్య చారి.
మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధకులు, మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం మండల వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లాదుర్గం చౌరస్తాలో కెసిఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లె గడ్డ నరసింహులు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ దుర్గారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ జన హృదయ నేత రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉన్నంతవరకు ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు. కెసిఆర్ పాలనలోనే అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ రూపురేఖలను మార్చిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేసిన గొప్ప మనసున్న మారాజు అని పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సాయికుమార్, నవీన్ రెడ్డి, దశరథ్, శివరాం, కృష్ణ గౌడ్, మోహన్, నరసప్ప, అశోక్ గౌడ్, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.