ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త .. పంట నష్టం రైతులకి త్వరలోనే అందివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం . రాష్ట్రంలో గతేడాది అధిక వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుంది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిన నగదు జమ అవుతుంది. నగదు జమ అయిన తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.