ముత్తంగి చెరువు కట్టపై గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం గుర్తింపు.

తేది:17-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగి చెరువు కట్టపై గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సోమవారం (17-02-2026) ఉదయం సుమారు 7:30 గంటలకు గుర్తించబడింది. మృతుడు వయస్సు సుమారు 35 నుండి 49 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మృతుడు మెరూన్ రంగు షర్ట్, బ్లాక్ రంగు జీన్స్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మోర్చురీకి తరలించి భద్రపరిచారు.
ఈ మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా సమాచారం తెలిసిన వారు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను 8712661839, 8712581496 నంబర్లకు తెలియజేయవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *