మహా శివరాత్రి సందర్భంగా ఆరూర్ రామేశ్వరాలయంలో శివ స్వామి ప్రార్థనలు.

తేది:16/02/2026 సంగారెడ్డి జిల్లా  TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా :ఫిబ్రవరి 15 శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలోని రామేశ్వర గుట్టపై ఉన్న ఆరూర్ రామేశ్వరాలయం ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహించారు.
తెల్లవారుజామున 4 గంటలకు శివస్వామివారి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ కుమార్ స్వామి మాట్లాడుతూ, లోక సంక్షేమం కోసం, ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కోసం, అన్ని ప్రజలు మరియు జీవుల రక్షణ కోసం ప్రార్థనలు నిర్వహించినట్లు అన్నారు.
కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంతోష్ కుమార్ స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శివ స్వామిల బృందం నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *