మెదక్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా – చైర్మన్‌గా కానుగు రాధిక, వైస్ చైర్మన్‌గా నరేష్ గౌడ్.

తేది:16-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగి చివరికి ముగిసింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కాగా, దొంతి నరేష్ గౌడ్ వైస్ చైర్మన్‌గా ఎన్నుకోబడ్డారు.
ఎన్నికల ప్రత్యేక అధికారి జడ్‌పీ సీఈఓ ఎల్లయ్య సమక్షంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఈ సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ హాజరై నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, మెదక్ పట్టణ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అవసరమైన నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో కృషి చేస్తానని తెలిపారు.
చైర్మన్‌గా ఎన్నికైన రాధిక పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన నరేష్ గౌడ్ కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *