నేడే అందోలు-జోగిపేట మున్సిపాలిటీ కొలువుదీరనున్న పాలకవర్గం-మరికొన్ని గంటల్లో చైర్మన్ గా ఎస్.కృష్ణారెడ్డి.

తేది:16-02-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ సిహెచ్ సత్యనారాయణ.

సంగారెడ్డి జిల్లా: అందోలు నియోజకవర్గం అందోలు-జోగిపేట మున్సిపాలిటీ 20 వార్డులతో మమేకమై ఉండి. కాగా ప్రస్తుతం కొనసాగిన మున్సిపల్ ఎన్నికలలో హోరాహోరీగా కొనసాగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టంగా తీసుకొని మూడు రోజులపాటు ఇక్కడే తిష్ట వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విజయం వైపు నడిపించారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 16 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా మూడు వార్డులలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాగా స్వతంత్ర అభ్యర్థిగా మరో అభ్యర్థి నిలవడం విశేషం.
మున్సిపాలిటీ కిరీటం ఎస్. కృష్ణారెడ్డికే:
సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎస్. కృష్ణారెడ్డి గతంలో ఈ మున్సిపాలిటీ నగర పంచాయతీ గా ఉన్నప్పుడు కృష్ణారెడ్డి పంచాయతీ పర్సన్ ఇన్చార్జిగా పనిచేశారు. ఆయన 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఘన విజయం సాధించారు. మంత్రి ఆశీస్సులు కూడా అతనిపై ఉండడంతో చైర్మన్ పదవి ఇతనికే దక్కుతుందన్న విషయం అందరి విశ్వాసం. సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంతో పాటుతో పాటు చైర్మన్ గా కృష్ణారెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *