ఆలయ నిర్మాణానికి విరాళాలు అందచేత.

తేది:15-02-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: గిసుకొండ మండలములోని మచ్చాపూర్ గ్రామ పురాతన భక్త ఆంజనేయ సమేత శివాలయం శిదిలావస్థ చెందగా గ్రామస్థులు ఆలయ పునరనిర్మాణం చేపట్టారు.కాగా గ్రామానికి చెందిన వేల్పుల మమత సురేష్ దంపతులు 14,012.25 రూపాయలు,లక్కర్స్ శ్రీలత రవి కుమార్ దంపతులు. 10,016/- రూపాయలు,
పెరుమాండ్ల రమ్య ప్రవీణ్ దంపతులు 10,016/- రూపాయలు ఆలయ ఛైర్మెన్,శాశ్వత పురోహితులు దూపం మఠo రాజు కు 34044.25 రూపాయల నగదును ఆదివారం అందచేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ ఛైర్మెన్ శాశ్విత పురోహితులు దూపం మఠం రాజు మాట్లాడుతూ శివుడు, ఆంజనేయ స్వామి ఓకే గర్భగుడిలో ఎక్కడి ఆలయాలలో ఉన్నట్లు ఆనవాళ్లు లేవని అన్నారు. మచ్చాపూర్ గ్రామం లో కాకతీయులు పాలన కొనసాగించిన కాలంలో పాల రాతి శివలింగం తో కూడిన, హనుమాన్ విగ్రహాన్నీ పడమర ముఖ ద్వారం తో ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమములో గ్రామస్థులుగటికే నాగరాజు,దూపటి యుగేందర్, పత్తిపాక దామోదర్, వెంకటేశ్వర్లు, మొగసాని రమేష్,మంద రమేష్, బిల్ల చంద్రమౌళి,టప్పకాని యాకయ్య,బిల్ల కోదండ పాణి,
కోల సునీల్,న్యాడo ప్రశాంత్, వనపర్తి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *