తేది:15-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా :బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజున శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సేవాలాల్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారుఅనంతరం మాట్లాడుతూ…
సంత్ సేవాలాల్ జయంతిని కేసీఆర్ గారు సెలవు దినంగా, ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని అన్నారు.
ఈ సమస్త జీవకోటికి మాతృరూపం స్వీకరించాలని సేవాలాల్ బోధించారని తెలిపారు. హింస పాపమని, మత్తు, ధూమ పానం మానవాళికి శాపం అని అన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ మహిమలు అద్భుతమైనవని అన్నారు. సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల బాబు రావు, నాయకులు దువ్వ కనకరాజు, కోటేశ్వర్ రావు, కొండ్ర శంకర్, పొల్లపెల్లి రామ్మూర్తి, మూటిక రాజు, వరుణ్, బంటీ, సారిక, దేవేందర్, సంపతి రఘు, తదితరులు పాల్గొన్నారు.