తేది:15-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంను సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు.మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన శివ–పార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, దేశంలో శాంతి, సుభిక్షం నెలకొనాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఎంపీ గారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో ఎంపీ మాట్లాడారు. శివరాత్రి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో, ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించిన దేవస్థాన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవస్థాన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.