ఏడుపాయల జాతరలో తప్పిపోయిన 5ఏళ్ల బాలిక సురక్షితం.

తేది:15-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా: భారీ రద్దీ మధ్య ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం ప్రాంగణంలో తప్పిపోయిన 5ఏళ్ల బాలికను మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు.
ఏడుస్తూ కనిపించిన చిన్నారిని గుర్తించిన అదనపు ఎస్పీ గారు వెంటనే స్పందించి ధైర్యం చెప్పి, వివరాలు సేకరించారు. పోలీసుల సహకారంతో అనౌన్స్‌మెంట్ ద్వారా తల్లిదండ్రులను గుర్తించి బాలికను అప్పగించారు.తన కుమార్తెను చూసి కన్నీటి పర్యంతమైన తల్లి, పోలీసులకు మరియు అదనపు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన పోలీసుల అప్రమత్తతతో పాటు మానవీయతను కూడా ప్రతిబింబించింది.జాతరల వంటి రద్దీ ప్రాంతాల్లో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *