తేది:14-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సంగారెడ్డి పట్టణం రిపోర్టర్ బంగ్లా సాయికుమార్.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారితో భేటీ అయిన సిహెచ్ ఈశ్వర్ గౌడ్ సదాశివపేట పట్టణంలో గల 26 వార్డుల్లో అభివృద్ధి పనులను చేసేది శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వమే అని అందుకు కాంగ్రెస్ పార్టీ సిహెచ్ ఈశ్వర్ గౌడ్ యువసేన జగ్గారెడ్డి గారితో రాజకీయ జీవిత ప్రయాణం కొనసాగించేందుకు మొగ్గు చూపుతోందని తెలియజేశారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సదాశివపేట పట్టణంలో అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగడానికి కాంగ్రెస్ పార్టీ సిహెచ్ ఈశ్వర్ గౌడ్ యువసేన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ప్రజలకు అండగా ఉంటుందని పేరుపేరునా తెలియజేశారు. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో 8వ వార్డులో ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 8వ వార్డు ప్రజలకు అండగా ఉంటూ ఎనిమిదవ వార్డు అభివృద్ధి సాధించేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అందుకు కాంగ్రెస్ పార్టీ సిహెచ్ ఈశ్వర్ గౌడ్ యువసేన ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అండగా ఉంటారని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ, సందీప్, ఆశిష్ గౌడ్, హనుమంతు మరియు సిహెచ్ ఈశ్వర్ గౌడ్ యువసేన పాల్గొన్నారు.