జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 16న ప్రజావాణి రద్దు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:14- 02- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో సోమవారం అనగా 16.02.2026 రోజున నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్ ముగిసే వరకు ప్రజల నుంచి వినతుల స్వీకరణ ఉండదని, ఆ తర్వాతే యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పును జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *