తేది:12-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 5 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ కేంద్రాన్ని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రి కళాశాలలో ఏర్పాటు చేయగా ఈ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
కౌంటింగ్ ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కౌంటింగ్ టేబుళ్ల అమరికపై అధికారులతో చర్చించారు. సిబ్బందికి కేటాయించిన బాధ్యతలపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈవీఎంల భద్రతా ప్రమాణాలను అధికారులు తనిఖీ చేశారు. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అత్యవసర సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కౌంటింగ్ రోజున సిబ్బంది సమయానికి హాజరుకావాలని సూచించారు.
ఫలితాల ప్రకటనలో ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.
ఎన్నికలు శాంతియుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు,పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు, మరియు తదితరులు పాల్గొన్నారు.