తేది:12-02-2026 TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
అమీన్పూర్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని, కమిషనరేట్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసుల సేవలు మరింత బలోపేతం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ వేడుకలు సౌహార్దపూర్వక వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.