వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరిన ఎమ్మెల్యే  నాగరాజు.

తేది:11-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలు, అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తీవ్రంగా మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ ప్రజలను కోరిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు .తాను వర్ధన్నపేటలోనే ట్రైనింగ్ దశ నుంచి పోలీస్ అధికారిగా నిజాయితీగా సేవలందించి, పదోన్నతులు పొంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశానని గుర్తు చేశారు. రిటైర్ అయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన నిజాయితీని గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, వర్ధన్నపేట ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందానని తెలిపారు. గెలిచిన నాటి నుంచే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని, ప్రస్తుతం ఆ పార్టీ బూతుల రాష్ట్ర సమితిగా దిగజారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో, ఫ్రస్టేషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులపై ఏకవచన వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.వర్ధన్నపేట ప్రజల నమ్మకాన్ని దోచుకున్న ఆరూరి రమేష్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి స్వలాభం కోసం ఐదు గెస్ట్ హౌసులు నిర్మించుకున్నాడని, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ముందు బీజేపీలో చేరి, మళ్లీ స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌లోకి చేరిన వ్యక్తి ఆరూరి రమేష్ అని విమర్శించారు. కేటీఆర్, ఆరూరి కలిసి రాజకీయ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.మాజీ సీఎం కేసీఆర్‌ను గౌరవిస్తామని చెప్పినా, ఆయన్ను జాతిపితగా అభివర్ణించడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడటం మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సరైన దిశలో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.వర్ధన్నపేట పట్టణ సమగ్ర అభివృద్ధికి నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *