ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా, పెళ్లి కానుకగా రూ.21వేలు అందజేస్తా- సిధ్ధాపూర్ సర్పంచ్ షరీఫ్.

తేది:11-02- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAW NEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం, మండలం సిద్దాపూర్ గ్రామంలో వివాహం చేసుకునే ప్రతి ఆడబిడ్డకు మేనమామలా అండగా ఉంటానని సిద్ధాపూర్ సర్పంచ్ షరీఫ్ తన ఉదారతను చాటుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించడమే కాకుండా తన వంతు బాధ్యతగా రూ.21 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆడబిడ్డల పెళ్ళిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్నదే తన సంకల్పమని, అందుకే ప్రతి ఆడబిడ్డ వివాహనికి ఈ ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. వారితో పాటు నాయకులు మోసిన్ భాయ్, రాంరెడ్డి, మొయిజ్లు ప్రజా సంక్షేమమే అక్ష్యంగా సర్పంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *