తేది:11-02-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, అందోలు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ చాపల సత్యం.
సంగారెడ్డి జిల్లా: వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో ఎన్నికలు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపించింది. అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించగా అందులో కౌన్సిలర్ అభ్యర్థుల జాతకాలు తేల్చేందుకు ఓటర్లు సమాయత్తమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా ముందస్తు చర్యలుగా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మధ్యాహ్నం వరకు అధిక సంఖ్యలో మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 79 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ఓటర్లు ఇచ్చిన తీర్పు బ్యాలెట్ బాక్స్ లో భద్రంగా ఉన్నాయి. 13వ తారీకున అభ్యర్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అందరిలో ఉత్కంఠత నెలకొంది. అప్పటివరకు అందరూ వేచి చూడాల్సిందే.