జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల పనితీరు భేష్!!.

తేది:10-02-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జగద్గిరిగుట్ట పోలీసులకు మరియు
వై. కొండల్ రెడ్డి క్రాంతి కుమార్ లకు జూనియర్ న్యాయవాదుల సన్మానం. సమస్య వచ్చిన వెంటనే 24 గంటల లోపు పరిష్కరించి నిందితులను అదుపులోకి తీసుకున్న సీ.ఐ వెంకటేశం దాడి చేసిన గంజాయి ముఠాను పట్టుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్.ఐ అప్పారావు.
న్యాయవాది పై దాడి చేసిన దండగులపై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.
ఈ సందర్భంగా సి.ఐ వెంకటేశం న్యాయవాదులతో మాట్లాడుతూ న్యాయవాదులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టంలో ఇంకా మెరుగ్గా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని వారికి సానుకూలంగా స్పందించారు. గంజాయి సేవించే వ్యక్తుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల కు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. గంజాయి సేవించి సమాజంలో అమాయకులను ఇబ్బంది పెట్టే ముఠాలను పై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని వారన్నారు.ఇట్టి సీఐ వెంకటేశం ఎస్సై అప్పారావు, వై .కొండల్ రెడ్డి , క్రాంతి కుమార్ లను సన్మానించిన జూనియర్ న్యాయవాదులు, బాధితుడైన జూనియర్ న్యాయవాది రవితేజ మాట్లాడుతూ అడ్వకేట్ రక్షణ చట్టం త్వరగా తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలని , తనపై దాడి చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని జగద్గురు గుట్ట పోలీసులను వేడుకున్నారు. ముఖ్యంగా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ వై. కొండల్ రెడ్డి , క్రాంతి కుమార్ , మరియు కూకట్పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి ల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన న్యాయవాది రవితేజ మరియు వారి టీం సభ్యులు.ఇట్టి కార్యక్రమంలో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ వై.కొండల్ రెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కుమార్, న్యాయవాదులు రవితేజ, అడ్వకేట్ మహమ్మద్ సఫివుద్దీన్, గోవర్ధన్ రెడ్డి,డిభోర, సుమీ రాణి, కార్తిక, సాధన, గోవర్ధన్, మధు, దుర్గ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *