ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో గోడ నిర్మాణం తొలగింపు పై వివాదం.

తేది:10-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన పుప్పాల గంగారం తన స్వంత స్థలంలో గోడ నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి తాను ముందుగా మూడు సార్లు గ్రామ పంచాయతీకి వినతి పత్రాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ వినతి పత్రాలపై గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి లిఖితపూర్వక జవాబు అందలేదని తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి నుండి నోటీసులు అందినట్లు పేర్కొన్నారు. తాను నిర్మించిన గోడ అనంతరం తొలగించబడినట్లు తెలిపారు. డబ్బా గ్రామంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు ఉన్నాయని తన అభిప్రాయమని తెలిపారు. తాను సమర్పించిన వినతి పత్రాలను పరిగణనలోకి తీసుకుని విషయం పరిశీలించాలని పుప్పాల గంగారం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *