ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంథ్రోపిక్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సేఫ్‌గార్డ్ రిసెర్చ్ టీమ్ హెడ్‌గా పనిచేస్తున్న మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైన ముప్పులో ఉందని, అది కేవలం ఏఐ లేదా జీవాయుధాల వల్లే కాకుండా, పరస్పరం అనుసంధానమైన అనేక సంక్షోభాల వల్ల సంభవిస్తోందని ఆయన హెచ్చరించారు. ఐటీ రంగానికి ఆంథ్రోపిక్ కొత్త ఏఐ టూల్ సవాల్‌గా మారుతుందనే ఆందోళనల నడుమ ఈ రాజీనామా హాట్ టాపిక్‌గా మారింది.
మృణాంక్ శర్మ తన రాజీనామాకు ఖచ్చితమైన కారణాలను వెల్లడించనప్పటికీ, విలువలతో రాజీపడాల్సి రావడం మరియు నిరంతర పని ఒత్తిడిపై అసహనం వ్యక్తం చేశారు. ఏఐ మన మానవత్వాన్ని ఎలా వక్రీకరిస్తుంది అనే అంశంపై ఆయన తన చివరి ప్రాజెక్టులో పనిచేశారు. ఏఐ భద్రత (AI Safety) విషయంలో సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు లేదా రాజీ పడే ధోరణి ఆయనను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఆంథ్రోపిక్‌ను వీడిన తర్వాత ఆయన తన దృష్టిని కవిత్వం వైపు మళ్లించనున్నట్లు సూచనాప్రాయంగా తెలిపారు.
కేంబ్రిడ్జ్ మరియు ఆక్స్ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న మృణాంక్ శర్మ, ఏఐ ఆధారిత జీవాయుధ ఉగ్రవాదాన్ని అరికట్టే గార్డ్‌రెయిల్స్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆంథ్రోపిక్ సేఫ్టీ టీమ్ నుండి బయటకు వచ్చిన వారిలో ఈయన మొదటి వ్యక్తి కాదు; గతంలో హర్ష్ మెహతా, బెహనమ్ నేషాబూర్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఈ సంస్థను వీడారు. వరుసగా కీలక వ్యక్తులు వైదొలగడం ఏఐ సేఫ్టీ పట్ల ఆయా