న్యాయవాది స్వప్న హత్యను ఖండించిన రంగారెడ్డి జిల్లా బార్ సోసియేషన్ సభ్యులు.

తేది:09-02- 2026 TSLAWNEWS హైదరాబాద్ ఇన్చార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : మహిళా న్యాయవాదిని హత్య చేసిన నిందితులని కఠినంగా శిక్షించాలని పలుసం అనసూయ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యాయం జరిగే వరకూ మహిళ ఉద్యమమే కొనసాగిస్తామని నినాదాలు చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు.
మహిళను హత్య చేసి చంపడం అనేది దారుణం ,అని మండిపడ్డ రంగారెడ్డి జిల్లా కోర్ట్ లేడీ రిప్రజెంటేటివ్ న్యాయవాది అనసూయ మరియు వారి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణమే అమలుపరచాలని రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ శేరి ప్రతాప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బాసెట్టి కార్తీక్, లేడీ రిప్రజెంటేటివ్ పలుసం అనసూయ గౌడ్ , జాయింట్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రెజరర్ కర్ణం ప్రశాంత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ స్వామి అనంత, బీసీ మెంబర్ మండలపురం సునీత, ధరావత్ జ్యోతి, బి.సుఖేందర్ రెడ్డి, గౌడ రాజశేఖర్, బోరంపేట చంద్రశేఖర్, బానే మల్లేష్ దండం రామిరెడ్డి, సరళ రెడ్డి, బర్ల సునీత రాకేష్, ఇతర న్యాయవాదులు ఇట్టి న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండించారు.
ఇలా హత్యలు చేసుకుంటూ పోతే రక్షణ లేని సమాజంగా మారుతుందని , అలాగే పోలీస్ స్టేషన్లో న్యాయవాదుల పట్ల చిన్నచూపు ఉంది అని, ప్రతి పోలీస్ స్టేషన్లో న్యాయవాదులు వెళ్ళినప్పుడు తక్షణమే సమస్యను పరిష్కరించాలని న్యాయవాది పలుసం అనసూయ అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి డిమాండ్ చేస్తూ న్యాయవాది హత్యపై పరిపూర్ణ సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *