తేది:09-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా తప్పనిసరి.
జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11 తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా వెంట తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ అనుమతించిన గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటిని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డులు ఇవి:
1) ఓటర్ గుర్తింపు కార్డు
2) ఆధార్ కార్డు
3) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు
4) ఫోటోతో కూడిన పోస్టాఫీస్ / బ్యాంక్ పాస్‌బుక్
5) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
6) డ్రైవింగ్ లైసెన్స్
7) పాన్ కార్డు
8) ఫోటోతో కూడిన ఎస్సీ / ఎస్టీ / బీసీ 9) కుల ధృవీకరణ పత్రాలు
10) భారతీయ పాస్‌పోర్టు
11) ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
12) కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డు
13) ఎంపీ / ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డు
14) దివ్యాంగుల గుర్తింపు కార్డు
15) పట్టాదార్ పాస్ పుస్తకం
16) రేషన్ కార్డు
17) ఫోటోతో కూడిన ఆయుధ లైసెన్స్
18) స్వాతంత్ర్య సమరయోధుల ఐడీ కార్డు
ఆర్జీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డు పై గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు.