ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వేడుకలు – ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత.

తేది:09-02-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
బాలికల సాధికారతకు బాటలు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి. ఎస్ లత మాట్లాడుతూ:
బాలికలు తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ” ఇంటికి దీపం ఇల్లాలు “, “బాలికలు ఇంటికి దీపపు కిరణాల వంటి వారు”, బాలికలు విద్యావంతులైతేనే సమాజం వెలుగుతుంది అని పేర్కొన్నారు.
బేటీ బచావో – బేటీ పడావో పథకాన్ని మూడు స్థాయిల్లో అమలు చేయాలని పిలుపునిచ్చారు:

1. భ్రూణ హత్యల నివారణ: గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లలను కాపాడుకోవాలి.
2. రక్షణ మరియు విద్య: పుట్టిన తర్వాత సమాజంలోని వ్యతిరేక శక్తుల నుండి వారిని కాపాడి, ఆత్మరక్షణ విద్యతో పాటు మనోస్థైర్యాన్ని పెంపొందించాలి.
3. ఆర్థిక స్వావలంబన: బాల్య వివాహాలను నిరోధించి, చదువు, సంస్కారం మరియు ఆర్థిక స్వావలంబన ద్వారా వారు స్వయం సమృద్ధి సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
4. మహిళలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆమె కోరారు.
బాలికలు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో మీరు ఎంచుకున్న రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా అందుకు విద్యను మొదటి మెట్టుగా ఉపయోగించుకోవాలని సూచించారు.
జిల్లా సంక్షేమ అధికారి రాజ్ కుమార్ మాట్లాడుతూ:
బాలల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు.
బాలల భద్రత మరియు కౌన్సిలింగ్ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ 1098, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, బాలల పరిరక్షణ బృందం, అంగన్‌వాడీలు మరియు మిషన్ శక్తి, సఖి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
జిల్లాలోని 385 గ్రామ పంచాయితీల్లో ‘బేటీ బచావో – బేటీ పడావో’ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
బాలికల ఆరోగ్యం కోసం శానిటరీ ప్యాడ్స్, ఇన్సినరేటర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 11 బాల్య వివాహాలను అడ్డుకున్నామని, ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా 31 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామని వెల్లడించారు.
పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపరుస్తున్నామని, అన్ని పాఠశాల ల్లో మరియు అన్ని ప్రదేశాల్లో బాలికలకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు మరియు విజ్ఞాన ప్రదర్శనలు అలరించాయి.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఛాంపియన్లను, సోషల్ మరియు కమ్యూనిటీ మొబిలిటీ ఛాంపియన్లను ఈ సందర్భంగా జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమలో విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా బి.సి. సంక్షేమ అధికారిణి సునీత, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి సత్తమ్మ, డి పి అర్ వో పి. నరేష్, సి.డి.పి.ఓలు, సూపర్ వైజర్లు, మహిళా సాధికారత సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *