
తేది:08-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
భూగర్భ జలాల సమస్యలు, రోడ్ల సమస్యలు వెంటనే పరిష్కరిస్తా – జగ్గారెడ్డి కూతురు జయరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అండదండలతో శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తా- చింతల్పేట్ రేణుక శ్రీనివాస్ గౌడ్.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దాం 8వ వార్డు అభివృద్ధిని సాధిద్దాం- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ఇంటింటి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి కూతురు జయ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిదో వార్డులో ఉన్న భూగర్భ జలాల సమస్యలు, రోడ్ల సమస్యలు, వీధి దీపాల సమస్యలు, మురికి కాలువల సమస్యలు, పేదరిక నిర్మూలన సమస్యలను, నాన్న శ్రీ తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఎనిమిదో వార్డును సుందర వందరంగా తీర్చిదిద్దుతాను, జగ్గారెడ్డి గారి నాయకత్వం మీ అందరి నాయకత్వం అంటూ మీ అందరి ఆశీర్వాదంతో చింతల్పేట్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించండి అని హిందూ,ముస్లిం, క్రైస్తవ సోదరి సోదరీమణులకు పేరుపేరునా తెలియజేశారు.
ఎనిమిదవ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో అత్యధిక నిధులు కేటాయించే విధంగా చూస్తానని 8వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. ఇట్టి సందర్భంలో చింతల్పేట్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ ఈరోజు ఎనిమిదవ వార్డులో అవినీతిని అంతం చేసే ధర్మ యుద్ధమని కొనియాడుతూ ముఖ్యంగా భూగర్భ జలాల సమస్యను, డ్రైనేజీ సమస్యలను, వీధి దీపాల సమస్యలను, రోడ్ల సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీ తూర్పు జయప్రకాష్ గారి అండదండలతో అభివృద్ధిని సాధించడానికి అత్యధిక నిధులు తెప్పించి 8వ వార్డు సమస్యలు పరిష్కరించి ఎనిమిదవ వార్డును సుందర వందరంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తూ బిఆర్ఎస్ (టిఆర్ఎస్ ) మోసపూరిత మాటలకు మోసపోవద్దని అందరికీ పేరుపేరునా తెలియజేశారు. అదేవిధంగా 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుపు మీ అందరి గెలుపు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటెయ్యాలని తిరిగి సదాశిపేట పట్టణానికి సదాశివపేట పట్టణ మాజీ చైర్మన్ సిహెచ్ నరసింహ గౌడ్ పరిపాలన విధానం అందుబాటులో ఉంటుందని హిందూ ముస్లిం క్రైస్తవులను సమానంగా చూస్తూ వారి అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలియజేశారు. ప్రచారంలో భాగంగా న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ గత పది ఏళ్ల పాలనలో బిఆర్ఎస్ (టీఆర్ఎస్ ) ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మోసం చేసింది, మళ్లీ మోసపూరిత మాటలతో మీ ముందుకు వస్తుందని అందుకు బిఆర్ఎస్(టిఆర్ఎస్) పార్టీ కారు గుర్తును ఓడించి తగిన గుణపాఠం నేర్పించాలని తెలియజేశారు. అదేవిధంగా ఈ గెలుపు ఎనిమిదవ వార్డు ప్రజలదేనని , 8వ వార్డు ప్రజలు కోరుకునే పాలన కాంగ్రెస్ పాలన అని కొనియాడారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయులు, ఆశి రెడ్డి, వసీం, రాములు గౌడ్, యూసుఫ్, నవాజ్, మంజుల ఈశ్వర్ గౌడ్, యువ నాయకులు ఈశ్వర్ మరియు ఎనిమిదవ వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.